మెగాస్టార్ చిరంజీవి తన పుట్టిన రోజునాడు అభిమానులకు కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. బర్త్ డే సందర్భంగా చిరు ప్రత్యేకంగా దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అదే రోజు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 150 సినిమాను అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.
my Telugu stuff తెలుగు వెబ్ సైట్
Telugu website for health, news and other etc తెలుగు వెబ్ సైట్
8, ఆగస్టు 2015, శనివారం
Chiranjeevi 150th Film News 150 ఫిల్మ్ కోసం నయా లుక్ లోచిరు...
మెగాస్టార్ చిరంజీవి తన పుట్టిన రోజునాడు అభిమానులకు కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. బర్త్ డే సందర్భంగా చిరు ప్రత్యేకంగా దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అదే రోజు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 150 సినిమాను అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.
Deepika padukone in depression డిప్రెషన్ చాలా పెద్ద సమస్య : దీపిక పదుకొణె
మన దేశంలో డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకొనే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. డిప్రెషన్ ఉన్న వారు ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడానికి ఇష్టపడక మృత్యువాత పడుతున్నారు. గతంలో డిప్రెషన్ బారిన పడి చికిత్స పొంది ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ హీరోగా వెలుగుతున్న దీపికా పదుకొణె ఈ రోజు 'ద లివ్ లవ్ లాఫ్' ఫౌండేషన్ ట్విట్టర్ లోగోను దీపిక లాంఛ్ చేసింది. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ... డిప్రెషన్ చిన్న విషయం చిన్న విషయం కాదని, దేశంలో ప్రస్తుతం ఇది చాలా పెద్ద సమస్య అని అన్నారు. అంతేకాదు ప్రజలకు డిప్రెషన్ నుంచి బయటపడేందుకు అవగాహన కల్పించాలని చెప్పారు. అంతేకాదు త్వరలో ప్రారంభం కానున్న 'ద లివ్ లవ్ లాఫ్' సంస్థ డిప్రెషన్ పై పోరాడనున్నదని... డిప్రెషన్ తో బాధపడే వారికి సహాయం చేయనున్నదని చెప్పారు. అదృష్టవశాత్తు తనకు సరైన సమయంలో సహాయం అందడం వల్ల డిప్రెషన్ నుంచి బయటపడ్డానని... ఇతరులకు కూడా అలాంటి సహాయం అందించడానికి ఈ సంస్థ ముందుంటుందని దీపిక చెప్పారు.
Reshmi comments on Tollywood సినీ పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేసిన రష్మీ
రేష్మీ వెండితెరపై ముందుగా అడుగుపెట్టి సరైన సక్సెస్ అందుకోలేక ఆపై బుల్లితెరపై సీరియల్స్ చేసింది. మంచి టర్నింగ్ పాయింట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే జబర్దస్ట్ ప్రోగ్రాం లో యాంకరింగ్ రష్మి ముంగిట వాలింది. ఆ ప్రొగ్రామ్ తో చాలా పాపులర్ అయ్యింది. మళ్లీ సినిమాల్లో వేషాలు దక్కించుకొనే ప్రయత్నం చేస్తుంది. తాజాగా గుంటూర్ టాకీస్ సినిమాలో రష్మీ ముఖ్య పాత్రను పోషిస్తున్నది. కాగా ఈ రోజు రష్మి ఓ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమ గురించి, తను మోసపోయిన విధానం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. విశాఖపట్నం కు చెందిన ఈ హాట్ హాట్ యాంకర్ చెప్పిన ఆశక్తిదాయక విషయాల వివరాలు మీకోసం...
తనకు చిన్నతనం నుంచి సినిమాల్లో నటించాలని కోరిక ఉందని అందువల్ల తను చిన్నతనంలోనే సినిమా రంగం అంటే ఏమిటో తెలియకుండా.. అవగాహన లేకుండా హైదరాబాద్ వచ్చానని తెలిపింది. ఇక్కడికి వచ్చాక తాను చాలా కష్టపడ్డానని అంతేకాక సినిమాల్లో అవకాశాలకోసం కొంత మంది చేతిలో మోసపోయానని కామెంట్ చేసింది. చాలా మంది దర్శకులు తాము తీస్తున్న సినిమాల్లో మంచి పాత్రలిస్తామని చెప్పి చివరకు సినిమా విడుదలయ్యే సమయానికి ఆ సినిమాలో తను ఎక్కడ ఉన్నదో వెతుక్కొనేలా చేసేవారని ఆవేదనగా చెప్పింది రేష్మీ. - See more
తనకు చిన్నతనం నుంచి సినిమాల్లో నటించాలని కోరిక ఉందని అందువల్ల తను చిన్నతనంలోనే సినిమా రంగం అంటే ఏమిటో తెలియకుండా.. అవగాహన లేకుండా హైదరాబాద్ వచ్చానని తెలిపింది. ఇక్కడికి వచ్చాక తాను చాలా కష్టపడ్డానని అంతేకాక సినిమాల్లో అవకాశాలకోసం కొంత మంది చేతిలో మోసపోయానని కామెంట్ చేసింది. చాలా మంది దర్శకులు తాము తీస్తున్న సినిమాల్లో మంచి పాత్రలిస్తామని చెప్పి చివరకు సినిమా విడుదలయ్యే సమయానికి ఆ సినిమాలో తను ఎక్కడ ఉన్నదో వెతుక్కొనేలా చేసేవారని ఆవేదనగా చెప్పింది రేష్మీ. - See more
man sleeps with his dead since 11 years భార్య శవంతో 11 ఏళ్ళుగా...
ప్రేమ గుడ్డిది... నిజమైన ప్రేమ ఇద్దరి మధ్య ఏర్పడితే... అది స్వచ్చమైనదైతే... ఆ ప్రేమను మరణం కూడా విడదీయలేదని అంటారు. చరిత్రలో ఎన్నో ఫలించిన ప్రేమ కథలు, విఫలమైన ప్రేమ కథలున్నాయి. రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, సలీం అనార్కలి ఇలా ఎన్నో ప్రేమ జంటలు ఇప్పటికీ ప్రేమకు సజీవ సాక్షాలు. ఇక ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటిగా వర్ధిల్లుతున్న తాజ్ మహల్ కూడా ప్రేమకు ప్రతిరూపమే. కాగా ఒక భర్త తన భార్త మారణించగా ఆ భార్య శవం తొ దాదాపు 11 సంవత్సరాలనుంచి గడిపేస్తున్నాడు. దీంతో ఆయన భార్యపై చూపిస్తున్న ప్రేమ భయకంపితుల్ని చేస్తుంది.. అదే సమయంలో ఆయన ప్రేమ ఎంత గొప్పది.. అలాంటి భర్త ప్రేమను పొందిన భార్య ఎంత అదృష్టవంతురాలు అనిపిస్తుంది. వివారాల్లోకి వెళ్తే..
వియత్నాం లో క్వాంగ్ నాం ప్రావిన్స్ వద్ద ఓ వ్యక్తి (55) భార్య మరణించింది. మనిషికి జనన మరణాలు సహజం.. భర్త తన భార్య తనని విడిచి అర్ధాంతరంగా వెళ్ళిపోయిందని ఏడ్చాడు. తన భార్య తో పాటు తాను మరణించలేక ఆమె
జ్ఞాపకాలను మర్చి పోలేక ఆమె సమాధి వద్ద 20 నెలలు కాలం గడిపాడు. సమాధి వద్ద ఉన్నప్పుడు గాలి వాన వస్తున్నాయని భావించి ఆ భర్త ఓ ఆలోచన చేశాడు. దీంతో 2004 సంవత్సరంలో తన భార్య సమాధిని తవ్వి ఆమె హస్తికలను, మట్టిలో కలిసి పోని శరీర భాగాన్ని బయటికి తీసి వాటిని కాగితం మరియు మట్టి ని ఉపయోగించి మనిషి శరీరంలా తయారు చేశాడు. ఆ శరీరానికి ముఖంగా ఓ మాస్క్ ను తగిలించాడు. ఆమె శరీరానికి డ్రెస్ వేశాడు. ఆ శరీరాన్ని తన ఇంటిలో పెట్టుకొని భార్య పక్కన నిద్రపోవడం ప్రారంభించాడు. తండ్రి పక్కనే కొడుకు కూడా గత 11 సంవత్సరాలుగా ఆ శరీరం పక్కనే నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఈ విషయం బయటికి వచ్చి... సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
2, ఆగస్టు 2015, ఆదివారం
dandruff treatment tip in Telugu చుండ్రు నివారణ చిట్కాలు
dandruff treatment tip in Telugu చుండ్రు నివారణ చిట్కాలు
ఉంగరాల్లాంటి జుత్తు ఎంత ఒత్తుగా ఉన్నా.. తలలో చుండ్రు చేరితే కురులు వెలవెలబోతాయి. నలుగురిలో నగుబాటు చేసే చుండ్రు సమస్యను చిన్న చిన్న చిట్కాలతో దూరం చేసుకోవచ్చు.
వారంలో కనీసం రెండుసార్లయినా కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి.
ఉసిరి, కుంకుడుకాయ, శీకాకాయ పొడులను సమపాళ్లలో కలిపి రెండు లీటర్ల నీటిలో ఉడకబెట్టాలి. మిశ్రమం దగ్గరికి వచ్చాక షాంపూలా వాడితే మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి కుదుళ్లకు బాగా పట్టేలా మర్దనా చేసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య కొంత తీరుతుంది.
గసగసాలను మెత్తటి పేస్ట్‌లా చేసుకుని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే ఫలితం కనిపిస్తుంది.
ఒక కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసం కలిపి తలకు పట్టించి.. కాసేపాగి తలస్నానం చేస్తే మంచి గుణం ఉంటుంది.
మందారాకులను వేడి నూనెలో కలిపి తలకు రాసుకోవాలి. తరచూ ఇలా చేస్తే చుండ్రు సమస్య తీరుతంది. కుదుళు బలంగా అవుతాయి.
కొబ్బరి నీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి తాగితే చుండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చు.
పారిజాతం గింజలను మెత్తగా నూరి దాన్ని నూనెలో కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలంటు పోసుకోవాలి.
పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి.. కాసిన్ని నీళ్లు కలిపి మాడుకు పట్టించాలి. గంటన్నర తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
గుడ్డు తెల్లసొనను జుట్టుకు పట్టించి.. గంట తర్వాత స్నానం చేయాలి.
Yoga meditation steps advantages Telugu యోగ ధ్యానం పద్దతులు ఉపయోగాలు
| ||
‘‘నా జీవితంలో యోగాది చాలా ముఖ్య పాత్ర. నాలో సానుకూల ధోరణిని పెంచి, నన్నో సంతోషకరమైన వ్యక్తిలా తీర్చిదిద్దింది యోగా. దీని ప్రాముఖ్యతను అందరూ గుర్తించడం, దానికోసం ఒకరోజును కేటాయించడం ఆనందకరమైన విషయం. ఇకమీదట నాజీవితంలో జూన్ 21 ఎంతో ప్రత్యేకం’’ అంటున్నారు శిల్పాషెట్టి.
శక్తినిచ్చింది...
ప్రెగ్నెన్సీ సమయంలో వర్కవుట్లు చేయలేదు. దాంతో బరువు పెరిగిపోయాను. అదీకాక ప్రసవం తరువాత వంట్లో శక్తిలేక నీరసంగా ఉండేది. ఇలాగయితే లాభంలేదని మళ్లీ యోగా చేయడం మొదలుపెట్టాను. దాంతోపాటు వెయిట్స్‌కు సంబంధించిన వ్యాయామాలు కూడా చేసేదాన్ని. కొన్ని రోజుల్లోనే ఎనర్జిటిక్‌గా అనిపించింది. బరువు కూడా తగ్గాను.
ఈ సందర్భంగా నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా విలువ తెలుసుకోవాలి. కాని యువతలో ఎక్కువమంది యోగాని వృద్ధులకు సంబంధించిన వ్యవహారంగా చూస్తున్నారు. ఆ ఆలోచన చాలా తప్పు. యోగా అందరిది. అందరూ చేయాలి.
పిల్లలకీ అలవాటు చేయాలి
యోగా ద్వారా నేను శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రయోజనాన్ని పొందాను. నాలానే అందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవాలంటే యోగాని ఇష్టపడాలి. ఆస్వాదిస్తూ చేయాలి. యోగాకి సంబంధించిన డివిడి తేవడం నాతోనే మొదలు అనుకుంటాను. ఇలానే యోగా గురించి తెలియజెప్పే కార్యక్రమాలు మరెన్నో చేయాలనుకుంటున్నాను. చేస్తాను కూడా. మరో ముఖ్య విషయం ఏమిటంటే పిల్లలకి జంక్‌ఫుడ్ తినడమంటే ఇష్టం. కాని దూరంగా ఉండాల్సింది వాటికే కదా. అలాగని వాళ్లని జంక్‌ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉంచడం కష్టమే. అందుకని నెలకి ఒకటి లేదా రెండుసార్లు తిననివ్వాలి. అయితే చిన్నప్పట్నించే పిల్లలకి తమ శరీరం గురించి అర్థమయ్యేలా చెప్పాలి. అది యోగాని ప్రాక్టీసు చేయించడం ద్వారా అయితే మరింత సులభతరమవుతుంది.’’
| ||
skin care beauty tips in Telugu చర్మ సంరక్షణ చిట్కాలు టిప్స్ తెలుగు
skin care tips in Telugu in summer
వేసవిలో ముఖం, చేతులపై చర్మం కందిపోకుండా కాపాడుకోవాలంటే... కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో చూడండి..
చర్మ సంరక్షణ చిట్కాలు టిప్స్ తెలుగు
ఫేస్ వాష్ : ఎండాకాలంలో ముఖం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల ముఖం మీద దుమ్ము ధూళి పడి పాడైపోయే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అవసరం అనుకుంటే సోపు వాడుచ్చు. లేదంటే ఫేస్‌వాష్ లోషన్లు, క్రీములు వాడొచ్చు.
సన్‌స్ర్కీన్ లోషన్ : ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు ప్రతి అరగంటకొకసారి ఎస్‌పిఎఫ్ 30 (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్) లోషన్లను ముఖానికి రాసుకోవాలి. లేకపోతే వేసవి వేడి వల్ల చర్మం దెబ్బతింటుంది. ఒక్కోసారి చర్మక్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు.
సన్ బ్లాక్ క్రీమ్ : ఒక్కోసారి మిట్టమధ్యాహ్నం బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో ఎస్‌పిఎఫ్ 60 సన్‌బ్లాక్ క్రీముల్ని వెంటబెట్టుకు వెళ్లాలి. ముఖ్యంగా సమ్మర్‌లో ఎక్కువగా స్విమ్మింగ్ చేసేవాళ్లకు ఇది తప్పనిసరి.
మైల్డ్ షాంపూ : వేసవిలో సా్ట్రంగ్ షాంపూలను వాడొద్దు. అందులోని రసాయనాలకు వేసవి వేడి కూడా తోడవ్వడం
వల్ల జుట్టుకు హాని కలుగుతుంది. అందుకని ఈ సీజన్‌లో మైల్డ్ షాంపూలను ఉపయోగిస్తేనే మంచిది.
వల్ల జుట్టుకు హాని కలుగుతుంది. అందుకని ఈ సీజన్‌లో మైల్డ్ షాంపూలను ఉపయోగిస్తేనే మంచిది.
| ||
| ||
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)