how to prevent premature aging in Telugu
చర్మం కొంచెం డల్‌గా కనిపించగానే ఆందోళన మొదలవుతుంది. ముఖంపై ముడతలు కనిపించగానే ఆందోళన రెట్టింపవుతుంది. ఆ వెంటనే కనిపించిన క్రీమ్‌ను రుద్దడం, ఫేస్‌ఫ్యాక్‌లంటూ పరుగెత్తడం చేస్తుంటారు. అయితే యవ్వనంగా కనిపించాలన్నా, వయసుపైబడుతున్న ఛాయలు దరిచేరకుండా ఉండాలన్నా ఈ జాగ్రత్తలు పాటించండి.సన్‌స్ర్కీన్‌లోషన్ ఉపయోగించండి
ఎండ ఉన్నా లేకపోయినా, ఏసీ గదుల్లో పనిచేస్తున్నా సన్‌స్ర్కీన్ లోషన్ ఉపయోగించడం మరచిపోవద్దు. ఎక్కువ సమయం, ఎక్కువ రోజులు ఎండకు ఎక్స్‌పోజ్ కావడం వల్ల చర్మంపై ముడతలు వస్తాయి. పిగ్మెంటేషన్ సమస్య తలెత్తుతుంది. ఇవన్నీ వయసుపై బడినట్లుగా చూపిస్తాయి.
ముందే జాగ్రత్తపడండి : వయసు పైబడుతున్న ఛాయలు కనిపించాక చర్యలు తీసుకునే బదులుగా ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రోజూ ఆహారంలో శరీరానికి కావలసిన యాంటీఆక్సిడెంట్లు లభించేలా చూసుకోవాలి. మార్కెట్లో లభించే ఏజ్ మిరాకిల్ క్రీమ్‌లను ఉపయోగించడం వల్ల కూడా కొంచెం ఫలితం ఉంటుంది.
తగినంత నిద్ర : రోజూ తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. వీకెండ్ పార్టీలని, స్నేహితులని నిద్రకు దూరం కాకండి. శరీరానికి సరిపడా నిద్ర పోకపోతే దాని ప్రభావం చర్మంపై పడుతుంది.
క్లీన్సింగ్ : మంచి ఫేస్ వాష్ క్రీమ్‌తో లేక క్లీన్సర్‌తో తరచుగా ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీనివల్ల ముఖంపై ఉన్న చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి.
నో ఆల్కహాల్ : ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేయండి. ఆల్కహాల్ వల్ల డీహైడ్రేషన్ సమస్యకు దారితీస్తుంది. దీనివల్ల చర్మం ఎండిపోతుంది. ఫలితంగా ముడతలు ఏర్పడతాయి. చర్మం రంగు మారుతుంది.
మేకప్ తుడిచేయండి : రాత్రి పడుకునే ముందు మేకప్ పూర్తిగా తొలగించుకోండి. చర్మానికి అవసరమైన ఆక్సిజన్ అందాలంటే మేకప్ తుడిచేయాల్సిందే.
షుగర్‌కు నో చెప్పండి : శరీరానికి షుగర్ అవసరమే. కానీ అధికంగా తీసుకుంటే అది కొల్లాజెన్ అనే ప్రొటీన్‌తో ఇంటర్‌ఫియర్ అవుతుంది. ఈ ప్రొటీన్ చర్మం యవ్వనంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి పంచదారకు దూరంగా ఉండండి.
వర్కవుట్స్ : క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. వృద్ధాప్యఛాయలు దరిచేరకుండా ఉంటాయి. రోజు కనీసం 45 నిమిషాలు వ్యాయామం చే యడం అలవాటు చేసుకోండి.
స్మోకింగ్ వద్దు : పొగాకులో ఉండే నికోటిన్ అనే పదార్థం చర్మానికి సరఫరా అవుతున్న రక్తాన్ని అడ్డుకుంటుంది. ఫలితంగా చర్మం డల్‌గా మారుతుంది. జీవం కోల్పోయినట్లుగా మారుతుంది. కాబట్టి స్మోకింగ్ వదిలేయండి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వయసుపై బడుతున్న ఛాయలు మీ దరిచేరకుండా చూసుకోవచ్చు.
టీనేజ్‌లో తీసుకునే ఆహారపు అలవాట్ల ప్రభావం ముప్ఫై ఏళ్లు వచ్చేసరికి కనిపిస్తుంది. యువతీయువకులు ఎక్కువగా జంక్‌ఫుడ్ తీసుకుంటుంటారు. ఇది చర్మంపై చాలా ప్రభావం చూపిస్తుంది. చర్మం కాంతిని కోల్పోవడం, మొటిమలు రావడం, సరైన పోషకపదార్థాలు అందని కారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి టీనేజ్‌లో మంచి ఆహారపు అలవాట్లను పాటించాలి.
రోజూ వ్యాయామం చేయాలి. ఎరోబిక్స్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాల ద్వారా చర్మ గ్రంధులు ఉత్తేజం చెంది చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.
చర్మం నిగనిగలాడాలంటే కంటి నిండా నిద్రపోవడం కూడా చాలా అవసరం. మంచి నిద్రవల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం, చర్మం కాంతి విహీనంగా ఉండటం తగ్గిపోతుంది.
చర్మం ఆరోగ్యంగా ఉండటంలో ఎ, సి, ఇ విటమిన్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇవి ఎక్కువగా పండ్లు, కూరగాయల్లో లభ్యమవుతాయి. పాల ఉత్పత్తుల్లోనూ, నట్స్‌లోనూ విటమిన్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. ముఖ్యంగా ఆకుకూరలు, నిమ్మ, నారింజ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
అదనంగా బయోటిన్, అరటిపండ్లు, కోడిగుడ్లు, గింజధాన్యాలు, చేపలు, కొవ్వు తొలగించిన మటన్, చికెన్ తీసుకోవచ్చు.అల్లం, జింక్ లభ్యమయ్యే ఆహారపదార్థాలను తీసుకోవడం కూడా ఉత్తమం. ఈ విటమిన్లలో యాంటాక్సిడెంట్ గుణం ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని రక్షిస్తాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా యవ్వనంగా కనిపించవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి