2, ఆగస్టు 2015, ఆదివారం

Yoga meditation steps advantages Telugu యోగ ధ్యానం పద్దతులు ఉపయోగాలు

ఐదడుగుల తొమ్మిదిన్నర అంగుళాల స్వీటి శెట్టి ... అనుష్కగా మారి వెండితెరపై 
కనిపించకముందు యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేవారు. ‘‘యోగ.. నా జీవితంలో 
ఒక భాగం కాదు. యోగానే నా జీవితం’’ అంటున్న ఆమె మాటల్లోనే యోగ తన
జీవితంలో తెచ్చిన మార్పుల గురించి...
 

Yoga and meditation steps advantages Telugu యోగ ధ్యానం పద్దతులు ఉపయోగాలు

 
‘‘మెడిటేషన్‌ వర్క్‌షా్‌పకి వెళ్లినప్పుడు భరత్‌ ఠాకూర్‌ని కలిశాను. ఆ తరువాత ఆయనే నాకు యోగా గురువు అయ్యారు. యోగా చేయడం చాలా బాగా అనిపించింది. యోగ చేయడం మొదలుపెట్టాక నా ఆలోచనాధోరణిలో, వ్యక్తిత్వంలో మంచి మార్పులు చోటుచేసుకున్నాయి. యోగా నేర్చుకున్నాక నాకు యోగాను నలుగురికీ నేర్పించాలి అనిపించింది. కాని మా నాన్న అందుకు ఒప్పుకోలేదు. నేను యోగా నేర్పించడాన్ని ఒప్పుకునేందుకు ఆయనకు చాలానే టైం పట్టింది.
 
ఆరోగ్యకరమైన ఫిట్‌నెస్‌ కోసం...
యోగా టీచర్‌గా నా మొదటి యోగా క్లాస్‌లో ఎన్నో సానుకూల భావనలు కలిగాయి నాకు. క్లాసులకు 45 నుంచి 50 యేళ్ల మధ్య వయస్కులు వచ్చే వాళ్లు. యోగ నేర్చుకోవడంతో పాటు వాళ్ల సమస్యల గురించి కూడా మాట్లాడేవారు. ఆ ప్రపంచమే వేరుగా ఉంటుంది. శరీరాన్ని చురుకుగా, ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఊబకాయాన్ని తగ్గించడంలో యోగా బాగా పనిచేస్తుందనే విషయం తెలిసిందే. ఇవేకాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా యోగ మంచి టూల్‌. నేను రోజుకి 30 నిమిషాల వర్కవుట్‌ సెషన్‌ చేస్తాను.
యోగా చేయడంతో పాటు తినే ఆహారం మీద కూడా శ్రద్ధపెడతాను. తేనెను రోజూ తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. అందుకే నా బ్రేక్‌ఫా్‌స్టలో బ్రెడ్‌, తేనె ఉంటాయి. బ్రెడ్‌ ముక్కల మీద తేనెని పూసి తింటాను. తినే తిండి గ్లూటెన్‌ ఫ్రీ జోన్‌గా ఉండాలి. జంక్‌, ఫాస్ట్‌ ఫుడ్‌లకి దూరంగా ఉంటాను. రాత్రి ఎనిమిది గంటల్లోపు డిన్నర్‌ చేస్తాను. రోజుకి ఆరు లీటర్ల నీళ్లు తాగుతాను. కార్డియో వ్యాయామాలు 40 నిమిషాలు చేశాక యోగ చేస్తాను. నా ఫిట్‌నెస్‌ స్టయిల్‌ సీక్రెట్‌ ఇదే.
 
సహజపద్ధతులే శ్రేయస్కరం
యోగాతో పాటు సౌందర్యానికి సంబంధించిన విషయంలో కూడా నేను ఎక్కువగా సహజసిద్ధమైన పద్ధతులనే ఆశ్రయిస్తాను. మోచేతులు. చీలమండల దగ్గర ఉండే నలుపు రంగు పోగొట్టాలంటే శెనగపిండిలో నిమ్మరసం కలిపి వాడాలి. జుట్టుకి కొబ్బరి నుంచి ఆలివ్‌ నూనెల వరకు ఏదైనా సరే వాడడం అనేది తప్పనిసరి. అవసరంలేనప్పుడు మేకప్‌ జోలికే వెళ్లను. దానివల్ల ముఖ చర్మం మీది రంధ్రాలు శ్వాసించి చర్మానికి సహజమెరుపు వస్తుంది. చర్మం మెరుపుకు యోగాని మించిన ప్రక్రియ మరోటి లేదు. అందుకనే ప్రత్యేకంగా ముఖం గురించి కొన్ని వ్యాయామాలు కూడా వచ్చాయిప్పుడు. నేను యోగ టీచర్‌గా పనిచేస్తున్నప్పుడు యోగా క్లాసులకి వచ్చిన తెలుగు దర్శకులు నన్ను హీరోయిన్‌ని చేశారు. 
నా యోగా గురు భరత్‌ ఠాకూర్‌ దగ్గర నేర్చుకున్న యోగా వల్ల శారీరకంగా ఓపిక, మానసికంగా పరిణతి వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యోగా వల్ల జీవితం పట్ల స్పష్టత, సమతుల్యం వచ్చాయి. యోగానే నా జీవితం. యోగా చేయడం మొదలుపెట్టి దశాబ్ద కాలం దాటింది. యోగాలో భాగంగా మెడిటేషన్‌, చాంటింగ్‌, ఆసనాలు వేయడం ఉంటాయి. అన్నీ సరిగా చేసినప్పుడు ఫలితం కళ్ల ముందు కనిపిస్తుంది. అలాగే నేనెప్పుడూ ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను. అదేంటంటే అకస్మాత్తుగా జీవితంలో మ్యాజిక్‌ జరిగిపోవాలి అనుకోకూడదు. జీవిత ప్రయాణంలో ఏవి ఎదురైనా వాటిని ఆహ్వానించాల్సిందే.’’

‘‘నా జీవితంలో యోగాది చాలా ముఖ్య పాత్ర. నాలో సానుకూల ధోరణిని పెంచి, నన్నో సంతోషకరమైన వ్యక్తిలా తీర్చిదిద్దింది యోగా. దీని ప్రాముఖ్యతను అందరూ గుర్తించడం, దానికోసం ఒకరోజును కేటాయించడం ఆనందకరమైన విషయం. ఇకమీదట నాజీవితంలో జూన్‌ 21 ఎంతో ప్రత్యేకం’’ అంటున్నారు శిల్పాషెట్టి.
 
‘‘నేను పద్నాలుగేళ్లుగా యోగా చేస్తున్నాను. యోగా మొదలుపెట్టడం కాకతాళీయంగా నే జరిగింది. నేను స్పాండిలైటి్‌సతో బాధపడుతుండేదాన్ని. అది గమనించిన ఒకరు యోగా చేయమని సూచించారు. యోగా పట్ల అంత ఆసక్తి లేకపోయినప్పటికీ చెప్పారు కదా అని చేయడం ప్రారంభించాను. కాని దాన్నంత ముఖ్యమైనదిగా పరిగణించేదాన్ని కాదు. చేయడం ప్రారంభించాక నెమ్మదినెమ్మదిగా అది నా జీవితంలో చాలా ముఖ్యమైనదిగా మారిపోయింది. మెడ నొప్పి విషయంలో అద్భుతమైన ఫలితాల్ని చూపించింది యోగ. అదొక్కటే కాకుండా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా చురుకుగా ఉంచింది నన్ను.
 
శక్తినిచ్చింది...
ప్రెగ్నెన్సీ సమయంలో వర్కవుట్లు చేయలేదు. దాంతో బరువు పెరిగిపోయాను. అదీకాక ప్రసవం తరువాత వంట్లో శక్తిలేక నీరసంగా ఉండేది. ఇలాగయితే లాభంలేదని మళ్లీ యోగా చేయడం మొదలుపెట్టాను. దాంతోపాటు వెయిట్స్‌కు సంబంధించిన వ్యాయామాలు కూడా చేసేదాన్ని. కొన్ని రోజుల్లోనే ఎనర్జిటిక్‌గా అనిపించింది. బరువు కూడా తగ్గాను.
 

 
ఈ సందర్భంగా నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా విలువ తెలుసుకోవాలి. కాని యువతలో ఎక్కువమంది యోగాని వృద్ధులకు సంబంధించిన వ్యవహారంగా చూస్తున్నారు. ఆ ఆలోచన చాలా తప్పు. యోగా అందరిది. అందరూ చేయాలి.
 
పిల్లలకీ అలవాటు చేయాలి
యోగా ద్వారా నేను శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రయోజనాన్ని పొందాను. నాలానే అందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవాలంటే యోగాని ఇష్టపడాలి. ఆస్వాదిస్తూ చేయాలి. యోగాకి సంబంధించిన డివిడి తేవడం నాతోనే మొదలు అనుకుంటాను. ఇలానే యోగా గురించి తెలియజెప్పే కార్యక్రమాలు మరెన్నో చేయాలనుకుంటున్నాను. చేస్తాను కూడా. మరో ముఖ్య విషయం ఏమిటంటే పిల్లలకి జంక్‌ఫుడ్‌ తినడమంటే ఇష్టం. కాని దూరంగా ఉండాల్సింది వాటికే కదా. అలాగని వాళ్లని జంక్‌ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉంచడం కష్టమే. అందుకని నెలకి ఒకటి లేదా రెండుసార్లు తిననివ్వాలి. అయితే చిన్నప్పట్నించే పిల్లలకి తమ శరీరం గురించి అర్థమయ్యేలా చెప్పాలి. అది యోగాని ప్రాక్టీసు చేయించడం ద్వారా అయితే మరింత సులభతరమవుతుంది.’’

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి