8, ఆగస్టు 2015, శనివారం

Chiranjeevi 150th Film News 150 ఫిల్మ్ కోసం నయా లుక్ లోచిరు...

Chiranjeevi's New Look for 150th Film


మెగాస్టార్‌ చిరంజీవి తన పుట్టిన రోజునాడు అభిమానులకు కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. బర్త్‌ డే సందర్భంగా చిరు ప్రత్యేకంగా దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అదే రోజు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 150 సినిమాను అనౌన్స్‌ చేస్తారని తెలుస్తోంది.

Deepika padukone in depression డిప్రెషన్ చాలా పెద్ద సమస్య : దీపిక పదుకొణె

  deepika padukone launches the live love laugh logo

మన దేశంలో డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకొనే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. డిప్రెషన్ ఉన్న వారు ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడానికి ఇష్టపడక మృత్యువాత పడుతున్నారు. గతంలో డిప్రెషన్ బారిన పడి చికిత్స పొంది ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ హీరోగా వెలుగుతున్న దీపికా పదుకొణె ఈ రోజు 'ద లివ్ లవ్ లాఫ్' ఫౌండేషన్ ట్విట్టర్ లోగోను దీపిక లాంఛ్ చేసింది. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ... డిప్రెషన్ చిన్న విషయం చిన్న విషయం కాదని, దేశంలో ప్రస్తుతం ఇది చాలా పెద్ద సమస్య అని అన్నారు. అంతేకాదు ప్రజలకు డిప్రెషన్ నుంచి బయటపడేందుకు అవగాహన కల్పించాలని చెప్పారు. అంతేకాదు త్వరలో ప్రారంభం కానున్న 'ద లివ్ లవ్ లాఫ్' సంస్థ డిప్రెషన్ పై పోరాడనున్నదని... డిప్రెషన్ తో బాధపడే వారికి సహాయం చేయనున్నదని చెప్పారు. అదృష్టవశాత్తు తనకు సరైన సమయంలో సహాయం అందడం వల్ల డిప్రెషన్ నుంచి బయటపడ్డానని... ఇతరులకు కూడా అలాంటి సహాయం అందించడానికి ఈ సంస్థ ముందుంటుందని దీపిక చెప్పారు.

Reshmi comments on Tollywood సినీ పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేసిన రష్మీ

రేష్మీ వెండితెరపై ముందుగా అడుగుపెట్టి సరైన సక్సెస్ అందుకోలేక ఆపై బుల్లితెరపై సీరియల్స్ చేసింది. మంచి టర్నింగ్ పాయింట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే జబర్దస్ట్ ప్రోగ్రాం లో యాంకరింగ్ రష్మి ముంగిట వాలింది. ఆ ప్రొగ్రామ్ తో చాలా పాపులర్ అయ్యింది. మళ్లీ సినిమాల్లో వేషాలు దక్కించుకొనే ప్రయత్నం చేస్తుంది. తాజాగా గుంటూర్ టాకీస్ సినిమాలో రష్మీ ముఖ్య పాత్రను పోషిస్తున్నది. కాగా ఈ రోజు రష్మి ఓ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమ గురించి, తను మోసపోయిన విధానం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. విశాఖపట్నం కు చెందిన ఈ హాట్ హాట్ యాంకర్ చెప్పిన ఆశక్తిదాయక విషయాల వివరాలు మీకోసం...

తనకు చిన్నతనం నుంచి సినిమాల్లో నటించాలని కోరిక ఉందని అందువల్ల తను చిన్నతనంలోనే సినిమా రంగం అంటే ఏమిటో తెలియకుండా.. అవగాహన లేకుండా హైదరాబాద్ వచ్చానని తెలిపింది. ఇక్కడికి వచ్చాక తాను చాలా కష్టపడ్డానని అంతేకాక సినిమాల్లో అవకాశాలకోసం కొంత మంది చేతిలో మోసపోయానని కామెంట్ చేసింది. చాలా మంది దర్శకులు తాము తీస్తున్న సినిమాల్లో మంచి పాత్రలిస్తామని చెప్పి చివరకు సినిమా విడుదలయ్యే సమయానికి ఆ సినిమాలో తను ఎక్కడ ఉన్నదో వెతుక్కొనేలా చేసేవారని ఆవేదనగా చెప్పింది రేష్మీ. - See more

man sleeps with his dead since 11 years భార్య శవంతో 11 ఏళ్ళుగా...



 man sleeps with dead wife for 11 years at vietnamese

ప్రేమ గుడ్డిది... నిజమైన ప్రేమ ఇద్దరి మధ్య ఏర్పడితే... అది స్వచ్చమైనదైతే... ఆ ప్రేమను మరణం కూడా విడదీయలేదని అంటారు. చరిత్రలో ఎన్నో ఫలించిన ప్రేమ కథలు, విఫలమైన ప్రేమ కథలున్నాయి. రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, సలీం అనార్కలి ఇలా ఎన్నో ప్రేమ జంటలు ఇప్పటికీ ప్రేమకు సజీవ సాక్షాలు. ఇక ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటిగా వర్ధిల్లుతున్న తాజ్ మహల్ కూడా ప్రేమకు ప్రతిరూపమే. కాగా ఒక భర్త తన భార్త మారణించగా ఆ భార్య శవం తొ దాదాపు 11 సంవత్సరాలనుంచి గడిపేస్తున్నాడు. దీంతో ఆయన భార్యపై చూపిస్తున్న ప్రేమ భయకంపితుల్ని చేస్తుంది.. అదే సమయంలో ఆయన ప్రేమ ఎంత గొప్పది.. అలాంటి భర్త ప్రేమను పొందిన భార్య ఎంత అదృష్టవంతురాలు అనిపిస్తుంది. వివారాల్లోకి వెళ్తే..

వియత్నాం లో క్వాంగ్ నాం ప్రావిన్స్ వద్ద ఓ వ్యక్తి (55)  భార్య మరణించింది. మనిషికి జనన మరణాలు సహజం.. భర్త తన భార్య తనని విడిచి అర్ధాంతరంగా వెళ్ళిపోయిందని ఏడ్చాడు. తన భార్య తో పాటు తాను మరణించలేక ఆమె 
జ్ఞాపకాలను మర్చి పోలేక ఆమె సమాధి వద్ద 20 నెలలు కాలం గడిపాడు. సమాధి వద్ద ఉన్నప్పుడు గాలి వాన వస్తున్నాయని భావించి ఆ భర్త ఓ ఆలోచన చేశాడు. దీంతో 2004 సంవత్సరంలో తన భార్య సమాధిని తవ్వి ఆమె హస్తికలను, మట్టిలో కలిసి పోని శరీర భాగాన్ని బయటికి తీసి వాటిని కాగితం మరియు మట్టి ని ఉపయోగించి మనిషి శరీరంలా తయారు చేశాడు. ఆ శరీరానికి ముఖంగా ఓ మాస్క్ ను తగిలించాడు. ఆమె శరీరానికి డ్రెస్ వేశాడు. ఆ శరీరాన్ని తన ఇంటిలో పెట్టుకొని భార్య పక్కన నిద్రపోవడం ప్రారంభించాడు. తండ్రి పక్కనే కొడుకు కూడా గత 11 సంవత్సరాలుగా ఆ శరీరం పక్కనే నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఈ విషయం బయటికి వచ్చి... సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

2, ఆగస్టు 2015, ఆదివారం

dandruff treatment tip in Telugu చుండ్రు నివారణ చిట్కాలు


 dandruff treatment tip in Telugu చుండ్రు నివారణ చిట్కాలు

ఉంగరాల్లాంటి జుత్తు ఎంత ఒత్తుగా ఉన్నా.. తలలో చుండ్రు చేరితే కురులు వెలవెలబోతాయి. నలుగురిలో నగుబాటు చేసే చుండ్రు సమస్యను చిన్న చిన్న చిట్కాలతో దూరం చేసుకోవచ్చు.

వారంలో కనీసం రెండుసార్లయినా కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి.
ఉసిరి, కుంకుడుకాయ, శీకాకాయ పొడులను సమపాళ్లలో కలిపి రెండు లీటర్ల నీటిలో ఉడకబెట్టాలి. మిశ్రమం దగ్గరికి వచ్చాక షాంపూలా వాడితే మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి కుదుళ్లకు బాగా పట్టేలా మర్దనా చేసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య కొంత తీరుతుంది.
గసగసాలను మెత్తటి పేస్ట్‌లా చేసుకుని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే ఫలితం కనిపిస్తుంది.
ఒక కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసం కలిపి తలకు పట్టించి.. కాసేపాగి తలస్నానం చేస్తే మంచి గుణం ఉంటుంది.
మందారాకులను వేడి నూనెలో కలిపి తలకు రాసుకోవాలి. తరచూ ఇలా చేస్తే చుండ్రు సమస్య తీరుతంది. కుదుళు బలంగా అవుతాయి.
కొబ్బరి నీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి తాగితే చుండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చు.
పారిజాతం గింజలను మెత్తగా నూరి దాన్ని నూనెలో కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలంటు పోసుకోవాలి.
పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి.. కాసిన్ని నీళ్లు కలిపి మాడుకు పట్టించాలి. గంటన్నర తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
 గుడ్డు తెల్లసొనను జుట్టుకు పట్టించి.. గంట తర్వాత స్నానం చేయాలి.

Yoga meditation steps advantages Telugu యోగ ధ్యానం పద్దతులు ఉపయోగాలు

ఐదడుగుల తొమ్మిదిన్నర అంగుళాల స్వీటి శెట్టి ... అనుష్కగా మారి వెండితెరపై 
కనిపించకముందు యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేవారు. ‘‘యోగ.. నా జీవితంలో 
ఒక భాగం కాదు. యోగానే నా జీవితం’’ అంటున్న ఆమె మాటల్లోనే యోగ తన
జీవితంలో తెచ్చిన మార్పుల గురించి...
 

Yoga and meditation steps advantages Telugu యోగ ధ్యానం పద్దతులు ఉపయోగాలు

 
‘‘మెడిటేషన్‌ వర్క్‌షా్‌పకి వెళ్లినప్పుడు భరత్‌ ఠాకూర్‌ని కలిశాను. ఆ తరువాత ఆయనే నాకు యోగా గురువు అయ్యారు. యోగా చేయడం చాలా బాగా అనిపించింది. యోగ చేయడం మొదలుపెట్టాక నా ఆలోచనాధోరణిలో, వ్యక్తిత్వంలో మంచి మార్పులు చోటుచేసుకున్నాయి. యోగా నేర్చుకున్నాక నాకు యోగాను నలుగురికీ నేర్పించాలి అనిపించింది. కాని మా నాన్న అందుకు ఒప్పుకోలేదు. నేను యోగా నేర్పించడాన్ని ఒప్పుకునేందుకు ఆయనకు చాలానే టైం పట్టింది.
 
ఆరోగ్యకరమైన ఫిట్‌నెస్‌ కోసం...
యోగా టీచర్‌గా నా మొదటి యోగా క్లాస్‌లో ఎన్నో సానుకూల భావనలు కలిగాయి నాకు. క్లాసులకు 45 నుంచి 50 యేళ్ల మధ్య వయస్కులు వచ్చే వాళ్లు. యోగ నేర్చుకోవడంతో పాటు వాళ్ల సమస్యల గురించి కూడా మాట్లాడేవారు. ఆ ప్రపంచమే వేరుగా ఉంటుంది. శరీరాన్ని చురుకుగా, ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఊబకాయాన్ని తగ్గించడంలో యోగా బాగా పనిచేస్తుందనే విషయం తెలిసిందే. ఇవేకాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా యోగ మంచి టూల్‌. నేను రోజుకి 30 నిమిషాల వర్కవుట్‌ సెషన్‌ చేస్తాను.
యోగా చేయడంతో పాటు తినే ఆహారం మీద కూడా శ్రద్ధపెడతాను. తేనెను రోజూ తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. అందుకే నా బ్రేక్‌ఫా్‌స్టలో బ్రెడ్‌, తేనె ఉంటాయి. బ్రెడ్‌ ముక్కల మీద తేనెని పూసి తింటాను. తినే తిండి గ్లూటెన్‌ ఫ్రీ జోన్‌గా ఉండాలి. జంక్‌, ఫాస్ట్‌ ఫుడ్‌లకి దూరంగా ఉంటాను. రాత్రి ఎనిమిది గంటల్లోపు డిన్నర్‌ చేస్తాను. రోజుకి ఆరు లీటర్ల నీళ్లు తాగుతాను. కార్డియో వ్యాయామాలు 40 నిమిషాలు చేశాక యోగ చేస్తాను. నా ఫిట్‌నెస్‌ స్టయిల్‌ సీక్రెట్‌ ఇదే.
 
సహజపద్ధతులే శ్రేయస్కరం
యోగాతో పాటు సౌందర్యానికి సంబంధించిన విషయంలో కూడా నేను ఎక్కువగా సహజసిద్ధమైన పద్ధతులనే ఆశ్రయిస్తాను. మోచేతులు. చీలమండల దగ్గర ఉండే నలుపు రంగు పోగొట్టాలంటే శెనగపిండిలో నిమ్మరసం కలిపి వాడాలి. జుట్టుకి కొబ్బరి నుంచి ఆలివ్‌ నూనెల వరకు ఏదైనా సరే వాడడం అనేది తప్పనిసరి. అవసరంలేనప్పుడు మేకప్‌ జోలికే వెళ్లను. దానివల్ల ముఖ చర్మం మీది రంధ్రాలు శ్వాసించి చర్మానికి సహజమెరుపు వస్తుంది. చర్మం మెరుపుకు యోగాని మించిన ప్రక్రియ మరోటి లేదు. అందుకనే ప్రత్యేకంగా ముఖం గురించి కొన్ని వ్యాయామాలు కూడా వచ్చాయిప్పుడు. నేను యోగ టీచర్‌గా పనిచేస్తున్నప్పుడు యోగా క్లాసులకి వచ్చిన తెలుగు దర్శకులు నన్ను హీరోయిన్‌ని చేశారు. 
నా యోగా గురు భరత్‌ ఠాకూర్‌ దగ్గర నేర్చుకున్న యోగా వల్ల శారీరకంగా ఓపిక, మానసికంగా పరిణతి వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యోగా వల్ల జీవితం పట్ల స్పష్టత, సమతుల్యం వచ్చాయి. యోగానే నా జీవితం. యోగా చేయడం మొదలుపెట్టి దశాబ్ద కాలం దాటింది. యోగాలో భాగంగా మెడిటేషన్‌, చాంటింగ్‌, ఆసనాలు వేయడం ఉంటాయి. అన్నీ సరిగా చేసినప్పుడు ఫలితం కళ్ల ముందు కనిపిస్తుంది. అలాగే నేనెప్పుడూ ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను. అదేంటంటే అకస్మాత్తుగా జీవితంలో మ్యాజిక్‌ జరిగిపోవాలి అనుకోకూడదు. జీవిత ప్రయాణంలో ఏవి ఎదురైనా వాటిని ఆహ్వానించాల్సిందే.’’

‘‘నా జీవితంలో యోగాది చాలా ముఖ్య పాత్ర. నాలో సానుకూల ధోరణిని పెంచి, నన్నో సంతోషకరమైన వ్యక్తిలా తీర్చిదిద్దింది యోగా. దీని ప్రాముఖ్యతను అందరూ గుర్తించడం, దానికోసం ఒకరోజును కేటాయించడం ఆనందకరమైన విషయం. ఇకమీదట నాజీవితంలో జూన్‌ 21 ఎంతో ప్రత్యేకం’’ అంటున్నారు శిల్పాషెట్టి.
 
‘‘నేను పద్నాలుగేళ్లుగా యోగా చేస్తున్నాను. యోగా మొదలుపెట్టడం కాకతాళీయంగా నే జరిగింది. నేను స్పాండిలైటి్‌సతో బాధపడుతుండేదాన్ని. అది గమనించిన ఒకరు యోగా చేయమని సూచించారు. యోగా పట్ల అంత ఆసక్తి లేకపోయినప్పటికీ చెప్పారు కదా అని చేయడం ప్రారంభించాను. కాని దాన్నంత ముఖ్యమైనదిగా పరిగణించేదాన్ని కాదు. చేయడం ప్రారంభించాక నెమ్మదినెమ్మదిగా అది నా జీవితంలో చాలా ముఖ్యమైనదిగా మారిపోయింది. మెడ నొప్పి విషయంలో అద్భుతమైన ఫలితాల్ని చూపించింది యోగ. అదొక్కటే కాకుండా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా చురుకుగా ఉంచింది నన్ను.
 
శక్తినిచ్చింది...
ప్రెగ్నెన్సీ సమయంలో వర్కవుట్లు చేయలేదు. దాంతో బరువు పెరిగిపోయాను. అదీకాక ప్రసవం తరువాత వంట్లో శక్తిలేక నీరసంగా ఉండేది. ఇలాగయితే లాభంలేదని మళ్లీ యోగా చేయడం మొదలుపెట్టాను. దాంతోపాటు వెయిట్స్‌కు సంబంధించిన వ్యాయామాలు కూడా చేసేదాన్ని. కొన్ని రోజుల్లోనే ఎనర్జిటిక్‌గా అనిపించింది. బరువు కూడా తగ్గాను.
 

 
ఈ సందర్భంగా నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా విలువ తెలుసుకోవాలి. కాని యువతలో ఎక్కువమంది యోగాని వృద్ధులకు సంబంధించిన వ్యవహారంగా చూస్తున్నారు. ఆ ఆలోచన చాలా తప్పు. యోగా అందరిది. అందరూ చేయాలి.
 
పిల్లలకీ అలవాటు చేయాలి
యోగా ద్వారా నేను శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రయోజనాన్ని పొందాను. నాలానే అందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవాలంటే యోగాని ఇష్టపడాలి. ఆస్వాదిస్తూ చేయాలి. యోగాకి సంబంధించిన డివిడి తేవడం నాతోనే మొదలు అనుకుంటాను. ఇలానే యోగా గురించి తెలియజెప్పే కార్యక్రమాలు మరెన్నో చేయాలనుకుంటున్నాను. చేస్తాను కూడా. మరో ముఖ్య విషయం ఏమిటంటే పిల్లలకి జంక్‌ఫుడ్‌ తినడమంటే ఇష్టం. కాని దూరంగా ఉండాల్సింది వాటికే కదా. అలాగని వాళ్లని జంక్‌ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉంచడం కష్టమే. అందుకని నెలకి ఒకటి లేదా రెండుసార్లు తిననివ్వాలి. అయితే చిన్నప్పట్నించే పిల్లలకి తమ శరీరం గురించి అర్థమయ్యేలా చెప్పాలి. అది యోగాని ప్రాక్టీసు చేయించడం ద్వారా అయితే మరింత సులభతరమవుతుంది.’’

skin care beauty tips in Telugu చర్మ సంరక్షణ చిట్కాలు టిప్స్ తెలుగు

skin care tips in Telugu in summer

వేసవిలో ముఖం, చేతులపై చర్మం కందిపోకుండా కాపాడుకోవాలంటే... కొన్ని సింపుల్‌ చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో చూడండి.. 
చర్మ సంరక్షణ చిట్కాలు టిప్స్ తెలుగు
ఫేస్ వాష్ : ఎండాకాలంలో ముఖం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల ముఖం మీద దుమ్ము ధూళి పడి పాడైపోయే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అవసరం అనుకుంటే సోపు వాడుచ్చు. లేదంటే ఫేస్‌వాష్‌ లోషన్లు, క్రీములు వాడొచ్చు.
సన్‌స్ర్కీన్‌ లోషన్‌ : ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు ప్రతి అరగంటకొకసారి ఎస్‌పిఎఫ్‌ 30 (సన్‌ ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్‌) లోషన్లను ముఖానికి రాసుకోవాలి. లేకపోతే వేసవి వేడి వల్ల చర్మం దెబ్బతింటుంది. ఒక్కోసారి చర్మక్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు.
సన్‌ బ్లాక్‌ క్రీమ్‌ : ఒక్కోసారి మిట్టమధ్యాహ్నం బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో ఎస్‌పిఎఫ్‌ 60 సన్‌బ్లాక్‌ క్రీముల్ని వెంటబెట్టుకు వెళ్లాలి. ముఖ్యంగా సమ్మర్‌లో ఎక్కువగా స్విమ్మింగ్‌ చేసేవాళ్లకు ఇది తప్పనిసరి.
మైల్డ్‌ షాంపూ : వేసవిలో సా్ట్రంగ్‌ షాంపూలను వాడొద్దు. అందులోని రసాయనాలకు వేసవి వేడి కూడా తోడవ్వడం
 వల్ల జుట్టుకు హాని కలుగుతుంది. అందుకని ఈ సీజన్‌లో మైల్డ్‌ షాంపూలను ఉపయోగిస్తేనే మంచిది.


వేసవిలో ఎక్కువగా చర్మం కమిలిపోతుంటుంది. ముఖం, చేతులపై సూర్యకిరణాలు పడి చర్మంలో కాస్త తేడా వస్తుంది. ముఖ్యంగా స్త్రీలు స్కిన్‌ టాన్‌ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. చర్మం కమిలిపోకుండా మన ఇంట్లోనే చేసుకునే ఫేస్‌ ప్యాక్‌లేంటో తెలుసుకుందాం.
 
చాలామంది స్త్రీలు ముఖంపై చర్మం కమిలిపోయిందే అని బ్లీచింగ్‌ చేయించడం, లేదంటే వెంటనే ఇతర కాస్మొటిక్‌ ట్రీట్‌మెంట్స్‌ని వెతుక్కోవటం చేస్తుంటారు. వీటి వల్ల వెంటనే చర్మంలో మెరుగుదనం వచ్చినట్లు కనిపిస్తుంది. అయితే దీర్ఘకాలికంగా ఉండదు. అందుకే కాస్త సహనంతో ఎండ తాకిడికి గురైన చర్మాన్ని నేచురల్‌ హోమ్‌రెమెడీస్‌తో నయం చేయవచ్చు. 
 
అందానికి ‘నిమ్మ’దనం
ముఖ వర్చస్సు పెంచడంలో నిమ్మరసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖంతో పాటు, సమస్య ఉన్న మిగిలిన ప్రాంతాల్లో నిమ్మకాయని సగానికి కట్‌ చేసి డైరెక్ట్‌గా చర్మంపై అప్లై చేసుకోవచ్చు. నిమ్మరసానికి కాస్త తేనె కలిపి పట్టించుకోవచ్చు. డ్రై అయిన తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే స్కిన్‌ మెరిసిపోతుంది.
 
చర్మ సౌందర్యానికి మేటి టమోటా
విరివిగా కూరల్లో వాడుకునే టమోటా చక్కటి బ్యూటీ ప్రాడక్ట్‌. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌, మినరల్స్‌, విటమిన్స్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సన్‌టాన్‌ని తొలగించటంలో టమోటా ముఖ్యపాత్ర పోషిస్తుంది. టమోటాని బాగా గుజ్జు చేసి దానికి ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు, ఓట్స్‌ పిండి కలిపి మిక్స్‌ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత నీళ్లతో వాష్‌ చేసుకోవాలి. ముఖంలో కాంతి వస్తుంది.
 
ఆందం పెంచే ఆలూ
సూర్యకిరణాలకు దెబ్బతిన్న చర్మాన్ని మెరుగుపర్చడానికి ఆలూ పర్ఫెక్ట్‌. ఇందులో ఉండే సి విటమిన్‌ మంచి బ్లీచింగ్‌ ఏజెంట్‌లాగా ఉపయోగపడుతుంది. తొలుత ఆలుగడ్డపై ఉండే తోలు ఒలిచిన తర్వాత మెత్తగా చూర్ణం చేయాలి. దీనికి తగినంత నిమ్మరసం కలిపి కమిలిన ప్రాంతంలో అప్లై చేసి అరగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రపరచుకోవాలి. చక్కటి ఫలితం ఉంటుంది.
 
దోసతో మేని సొగసు
శరీరానికి దోసకాయ చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే దోసకాయ అంటే అందరికీ ఇష్టం. ఇక ఇందులో ఉండే విటమిన్‌ సి చక్కటి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. దోస ఫేస్‌ ప్యాక్‌ చేయటం చాలా సులువు. ముందు దోసకాయని జ్యూస్‌లాగా చేసుకుని ఒక బౌల్‌లో తీసుకోవాలి. దీనికి తగినంత పరిమాణంలో నిమ్మరసం, రోజ్‌వాటర్‌ కలిపి మిక్స్‌ చేయాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ని ముఖంతో పాటు కమలిన చేతులకి అప్లై చేసుకోవాలి. అరగంట ఆగాక కడిగేసుకోవాలి. ఇలా ఓ నాలుగసార్లు దోసకాయ ఫేస్‌ప్యాక్‌ని వాడితే మునుపటిలా స్కిన్‌లో గ్లో వస్తుంది.
 
చర్మకాంతికి అలొవిరా
అలొవిరా చర్మకాంతికి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎండకు వాడిపోయిన చర్మానికి చక్కటి గ్లో తెస్తుంది. డైరెక్ట్‌గా అలొవిరా రసాన్ని మాయిశ్చరైజ్‌ చేస్తే ముఖంలో వెలుగు రావటంతో పాటు సున్నితత్వం వస్తుంది. 
 
ఈ హోమ్‌ రెమిడీసన్నీ ఎండకు కమిలిన చర్మానికి మునుపటి అందం తీసుకు వస్తాయి. బయట నుంచి వచ్చాక ఫేస్‌ని చన్నీళ్లతో శుభ్రపరచుకున్న తర్వాతే ఈ నేచురల్‌ ఫేస్‌ప్యాక్స్‌ని అప్లై చేసుకోవాలి.


Home made face packs for bright skin మెరిసే చర్మం కోసం

ర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలంటే వంటింట్లో దొరికే వస్తువులతో ఆరోగ్యవంతమైన ఫేస్‌ ప్యాక్స్‌ తయారుచేసుకోవచ్చు. అలాంటి మూడు రకాల ఫేస్‌ ప్యాక్స్‌ గురించి ఇక్కడ తెలుసుకుందాం...

వేప, శెనగపిండి, పెరుగుతో ప్యాక్‌...

 
కావాల్సినవస్తువులు: వేపాకులు లేదా వేప పొడి, ఒక టేబుల్‌స్పూన్‌ శెనగపిండి, ఒక టీస్పూన్‌ పెరుగు.
 
ఫేస్‌ ప్యాక్‌ తయారీ: ఒక టీస్పూను పెరుగును చిన్న గిన్నెలో పోయాలి. అందులో శెనగపిండి కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. తర్వాత బాగా నూరిన వేపాకులు లేదా వేప పొడిని ఆ పేస్టులో కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10-15 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇందులో పెరుగు వాడడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. ఈ ప్యాక్‌లో వేపపొడి లేదా వేపాకులను ఉపయోగించడం వల్ల ముఖానికి యాంటిసెప్టిక్‌లా పనిచేస్తుంది.
 
బాదం, తేనె, కుంకుమపువ్వు ప్యాక్‌..
 
కావాల్సిన వస్తువులు: నాలుగు లేదా ఐదు బాదం పప్పులు(ముందురోజు రాత్రే నీళ్లల్లో గాని లేదా పాలల్లో గాని బాదం పప్పులను నానబెట్టాలి), ఒక టీస్పూన్‌ తేనె, కుంకుమపువ్వు (రెండు టేబుల్‌ స్పూన్ల గోరువెచ్చటి పాలల్లో కుంకుమపువ్వును నానబెట్టాలి), ఒక టీస్పూన్‌ నిమ్మరసం.
 
ఫేస్‌ ప్యాక్‌ తయారీ: నానిన బాదంపప్పులను పేస్టులా చేయాలి. ఆ పేస్టులో నానబెట్టిన కుంకుమపువ్వును కలపాలి. దీంతోపాటు తేనె, నిమ్మరసాల్ని కూడా కలిపి చిక్కని పేస్టులా తయారుచేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుని 10-15 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ముఖానికి రాసుకున్న పేస్టు ఎండిపోయిన తర్వాత పాలల్లో లేదా నీళ్లల్లో ముంచిన కాటన్‌ ప్యాడ్స్‌తో ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ ప్యాక్‌ రాసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మెరుపువస్తుంది. ఇందులో వాడిన కుంకుమపువ్వు స్కిన్‌టోన్‌ని మెరుగుపరుస్తుంది. చర్మం మీద మచ్చలను పోగొడుతుంది. తేనె వల్ల చర్మం సాగకుండా మంచి పటుత్వంతో ఉంటుంది. బాదం, నిమ్మ రెండూ చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తాయి.
 
అరటిపండు, పెరుగు ప్యాక్‌...
 
కావాల్సిన వస్తువులు: బాగా మగ్గిన అరటిపండు ఒకటి, పెరుగు ఒక టేబుల్‌స్పూను, తేనె ఒక టీస్పూను, నిమ్మరసం ఒక టీస్పూన్‌
 
ఫేస్‌ప్యాక్‌ తయారీ: చిన్న గిన్నె తీసుకుని అందులో అరిటిపండు గుజ్జును, పెరుగును వేసి బాగా కలపాలి. దానికి తేనె, నిమ్మరసం కూడా చేర్చి చిక్కటి పేస్టులా తయారుచేయాలి. ఈ ప్యాక్‌ను ముఖం మీద, మెడభాగంలో రాసుకోవాలి. ప్యాక్‌ ఎండిపోయే వరకూ ఉంచుకుని చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. నిమ్మ సహజసిద్ధమైన బ్లీచింగ్‌ ఏజెంట్‌. దీనివల్ల చర్మం శుభ్రంగా ఉండడంతోపాటు కాంతివంతంగా ఉంటుంది. అరటి పండు గుజ్జును రాసుకోవడం వల్ల కూడా చర్మం మెరుస్తుంది.

how to look younger యవ్వనంగా ఉండాలంటే...! how to prevent premature aging



 how to prevent premature aging in Telugu

చర్మం కొంచెం డల్‌గా కనిపించగానే ఆందోళన మొదలవుతుంది. ముఖంపై ముడతలు కనిపించగానే ఆందోళన రెట్టింపవుతుంది. ఆ వెంటనే కనిపించిన క్రీమ్‌ను రుద్దడం, ఫేస్‌ఫ్యాక్‌లంటూ పరుగెత్తడం చేస్తుంటారు. అయితే యవ్వనంగా కనిపించాలన్నా, వయసుపైబడుతున్న ఛాయలు దరిచేరకుండా ఉండాలన్నా ఈ జాగ్రత్తలు పాటించండి.

సన్‌స్ర్కీన్‌లోషన్‌ ఉపయోగించండి
 ఎండ ఉన్నా లేకపోయినా, ఏసీ గదుల్లో పనిచేస్తున్నా సన్‌స్ర్కీన్‌ లోషన్‌ ఉపయోగించడం మరచిపోవద్దు. ఎక్కువ సమయం, ఎక్కువ రోజులు ఎండకు ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల చర్మంపై ముడతలు వస్తాయి. పిగ్మెంటేషన్‌ సమస్య తలెత్తుతుంది. ఇవన్నీ వయసుపై బడినట్లుగా చూపిస్తాయి.

ముందే జాగ్రత్తపడండి : వయసు పైబడుతున్న ఛాయలు కనిపించాక చర్యలు తీసుకునే బదులుగా ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రోజూ ఆహారంలో శరీరానికి కావలసిన యాంటీఆక్సిడెంట్లు లభించేలా చూసుకోవాలి. మార్కెట్లో లభించే ఏజ్‌ మిరాకిల్‌ క్రీమ్‌లను ఉపయోగించడం వల్ల కూడా కొంచెం ఫలితం ఉంటుంది.
తగినంత నిద్ర : రోజూ తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. వీకెండ్‌ పార్టీలని, స్నేహితులని నిద్రకు దూరం కాకండి. శరీరానికి సరిపడా నిద్ర పోకపోతే దాని ప్రభావం చర్మంపై పడుతుంది.
క్లీన్సింగ్‌ : మంచి ఫేస్‌ వాష్‌ క్రీమ్‌తో లేక క్లీన్సర్‌తో తరచుగా ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీనివల్ల ముఖంపై ఉన్న చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి.
నో ఆల్కహాల్‌ : ఆల్కహాల్‌ అలవాటు ఉంటే మానేయండి. ఆల్కహాల్‌ వల్ల డీహైడ్రేషన్‌ సమస్యకు దారితీస్తుంది. దీనివల్ల చర్మం ఎండిపోతుంది. ఫలితంగా ముడతలు ఏర్పడతాయి. చర్మం రంగు మారుతుంది.
మేకప్‌ తుడిచేయండి : రాత్రి పడుకునే ముందు మేకప్‌ పూర్తిగా తొలగించుకోండి. చర్మానికి అవసరమైన ఆక్సిజన్‌ అందాలంటే మేకప్‌ తుడిచేయాల్సిందే.
షుగర్‌కు నో చెప్పండి : శరీరానికి షుగర్‌ అవసరమే. కానీ అధికంగా తీసుకుంటే అది కొల్లాజెన్‌ అనే ప్రొటీన్‌తో ఇంటర్‌ఫియర్‌ అవుతుంది. ఈ ప్రొటీన్‌ చర్మం యవ్వనంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి పంచదారకు దూరంగా ఉండండి.

వర్కవుట్స్‌ : క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. వృద్ధాప్యఛాయలు దరిచేరకుండా ఉంటాయి. రోజు కనీసం 45 నిమిషాలు వ్యాయామం చే యడం అలవాటు చేసుకోండి.

స్మోకింగ్‌ వద్దు : పొగాకులో ఉండే నికోటిన్‌ అనే పదార్థం చర్మానికి సరఫరా అవుతున్న రక్తాన్ని అడ్డుకుంటుంది. ఫలితంగా చర్మం డల్‌గా మారుతుంది. జీవం కోల్పోయినట్లుగా మారుతుంది. కాబట్టి స్మోకింగ్‌ వదిలేయండి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వయసుపై బడుతున్న ఛాయలు మీ దరిచేరకుండా చూసుకోవచ్చు.

టీనేజ్‌లో తీసుకునే ఆహారపు అలవాట్ల ప్రభావం ముప్ఫై ఏళ్లు వచ్చేసరికి కనిపిస్తుంది. యువతీయువకులు ఎక్కువగా జంక్‌ఫుడ్‌ తీసుకుంటుంటారు. ఇది చర్మంపై చాలా ప్రభావం చూపిస్తుంది. చర్మం కాంతిని కోల్పోవడం, మొటిమలు రావడం, సరైన పోషకపదార్థాలు అందని కారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి టీనేజ్‌లో మంచి ఆహారపు అలవాట్లను పాటించాలి.
 రోజూ వ్యాయామం చేయాలి. ఎరోబిక్స్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ లాంటి వ్యాయామాల ద్వారా చర్మ గ్రంధులు ఉత్తేజం చెంది చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.
 చర్మం నిగనిగలాడాలంటే కంటి నిండా నిద్రపోవడం కూడా చాలా అవసరం. మంచి నిద్రవల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం, చర్మం కాంతి విహీనంగా ఉండటం తగ్గిపోతుంది.
 చర్మం ఆరోగ్యంగా ఉండటంలో ఎ, సి, ఇ విటమిన్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇవి ఎక్కువగా పండ్లు, కూరగాయల్లో లభ్యమవుతాయి. పాల ఉత్పత్తుల్లోనూ, నట్స్‌లోనూ విటమిన్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. ముఖ్యంగా ఆకుకూరలు, నిమ్మ, నారింజ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
 అదనంగా బయోటిన్‌, అరటిపండ్లు, కోడిగుడ్లు, గింజధాన్యాలు, చేపలు, కొవ్వు తొలగించిన మటన్‌, చికెన్‌ తీసుకోవచ్చు.అల్లం, జింక్‌ లభ్యమయ్యే ఆహారపదార్థాలను తీసుకోవడం కూడా ఉత్తమం. ఈ విటమిన్లలో యాంటాక్సిడెంట్‌ గుణం ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని రక్షిస్తాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా యవ్వనంగా కనిపించవచ్చు.

Garlic advantages వెల్లుల్లి ఉపయోగాలు

 
 వెల్లుల్లి ఉపయోగాలు
వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాం...
 
బరువు తగ్గిస్తుంది:
రోజుకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాము. అంతేకాదు జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల ఆకలి వేయదు. జిహ్వచాపల్యం బాగా తగ్గుతుంది. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది.
 
రక్తానికి ఎంతో మంచిది:
శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాసు రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది: మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని పొద్దున్నే తాగితే మంచిది. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.
 
యాంటీ బాక్టీరియల్‌:
వెల్లుల్లి రసం బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లను బాగా తగ్గిస్తుంది. అంతేకాదు వైరల్‌, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను అరికడుతుంది. రోజూ వెల్లుల్లి తినడం వల్ల జలుబు,దగ్గు వంటి అనారోగ్యాలు దరిచేరవు. వెల్లుల్లిలోని యాంటిబాక్టీరియల్‌ పదార్థాలు గొంతు ఇన్ఫెక్షన్లను, శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లను పోగొడతాయి. ముఖ్యంగా బ్రోంకైటిస్‌ నివారణకు వెల్లుల్లి మందులా పనిచేస్తుంది.
 
కాలేయంకు మంచిది:
వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్‌, సెలినియం రసాయనాలు ఫ్యాటీ లివర్‌ జబ్బును ట్రీట్‌చేసే బైల్‌ అనే ఫ్లూయిడ్‌(కాలేయం ఈ ఫ్లూయిడ్‌ను ఉత్పత్తిచేస్తుంది. ఇది జీర్ణక్రియ సరిగా జరిగేట్టు సహాయపడుతుంది)ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. వెల్లుల్లిలో యాంటాక్సిడెంట్లు కూడా బాగా ఉన్నాయి. వీటిల్లో అమినోయాసిడ్స్‌, ప్రొటీన్లు కూడా ఉన్నాయని అధ్యయనాల్లో వెల్లడయింది. ఇవి కాలేయాన్ని ప్రకృతిసిద్ధమైన విష పదార్థాల నుంచి రక్షిస్తాయి. 
 
నొప్పి లేకుండా చేస్తుంది:
వెల్లుల్లిలో యాంటి ఆర్ధైటిక్‌ ప్రొపర్టీస్‌ బాగా ఉన్నాయి. ఇవి శరీరంలోని నొప్పిని తగ్గిస్తాయి. వీటిల్లోని యాంటీ-బాక్టీరియల్‌, ఎనాలజిస్టిక్‌ గుణాల వల్ల పంటి నొప్పి లాంటివి తగ్గుతాయి.
 
గుండెను కాపాడతాయి:
రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత బబ్బులు రావు. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడంలాంటివి (బ్లడ్‌ క్లాట్స్‌) సంభవించవు. పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తప్పనిసరిగా వెల్లుల్లి తినడం మంచిది.
 
బ్లడ్‌ షుగర్‌ని తగ్గిస్తుంది:
వెల్లుల్లి గ్లూకోజ్‌ టాలరెన్స్‌ను మెరుగుపరుస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని గుజ్జులా చేసి గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లతో నోట్లో వేసుకుని మింగేయాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్‌ షుగర్‌ తగ్గుతుంది.
 
కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది:
వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెసా్ట్రల్‌ పది నుంచి ఆరు శాతం వరకూ తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉన్న రసాయనాలకు ఆర్టీరియల్‌ ప్లేక్‌ ఫార్మేషన్‌ కాకుండా ఆపగల సామర్థ్యం కూడా ఉంది.
 
లైంగిక జీవనానికీ మంచిది:
రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యకరమైన లైంగిక జీవనాన్ని కొనసాగించగలుగుతారు.


anti hair fall tips in Telugu జుట్టు రాలకుండా వుండాలంటే ?


anti hair fall tips in Telugu  జుట్టు రాలకుండా వుండాలంటే ?

జుట్టు అధికంగా రాలితే మానసికంగా కృంగిపోతుంటారు. అలా కృంగిపోవటం వల్ల కూడా జుట్టు ఇంకా రాలే శాతం అధికమవుతుందని మర్చిపోరాదు. జుట్టు అధికంగా రాలే వారు తేలికపాటి టిప్స్‌తో పాటు కొన్ని హోమ్‌ రెమిడీస్ను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు. ఆ టిప్స్‌ తెల్సుకుందాం.
అధికంగా జుట్టు రాలిపోతుంటే మొదట ఓ రెండు విషయాలు పాటించాలి. ఒకటి పొడి జుట్టును పలుమార్లు దువ్వడం చేయకండి. దీని వల్ల జుట్టు రాలిపోయే అవకాశాలెక్కువ. ఇక రెండోది రోజూ ఉదయాన్నే తల మాడుని మసాజ్‌ చేయించుకోవాలి. దీని వల్ల పుర్రెమీద చర్మం ఉత్తేజితమవుతుంది. తద్వారా జుట్టు మూలాలు ఆరంభమయ్యే చోట ఉండే చిన్నపాటి రంధ్రాలు చురుకై ఆశించిన మంచి ఫలితం కలుగుతుంది.
ఆలివ్‌ లేదా కొబ్బరి నూనెను తీసుకుని దానిలోకి రెండు చుక్కల నిమ్మరసం వేయాలి. దీన్ని మిక్స్‌ చేసి తలకి అప్లై చేయాలి. ఒక గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో తలని శుభ్రపరుచుకోవాలి.
ఒక పాత్రలో నీటిని కాచి దాంట్లో కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె వేయాలి. ఒక టవల్‌ని ఆ నీటిలో ముంచి తలని కవర్‌ చేసేట్లు చుట్టేయాలి. ఇది న్యాచురల్‌ స్పా అనుకోవచ్చు.
వెల్లుల్లి, అల్లం లేదా ఉల్లి రసాన్ని రాత్రి పడుకునేముందు తలకి బాగా పట్టించుకోవాలి. ఉదయం నిద్ర లేస్తూనే జుట్టును శుభ్రం చేసుకోవాలి. చక్కని ఫలితం కలుగుతుంది.

జుట్టు ఊడిపోతుంటే చాలామంది తెగ ఆందోళన పడిపోతుంటారు. కానీ మనం తినే ఆహారం బట్టి కూడా శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయన్న విషయం ఎంతమందికి తెలుసు? అనారోగ్యపు ఆహారపు అలవాట్ల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. పలచబడుతుంది. వెంట్రుకలు పొడిబారిపోతాయి. అంతేకాదు తెల్లబడతాయి కూడా. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా ఆ ప్రభావం శిరోజాల పెరుగుదల మీద, చర్మ ఆరోగ్యం మీద పడుతుంది. కాలుష్యం, పర్యావరణంలో మార్పులు సైతం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే నిత్యం పోషకాహారాన్ని తీసుకోవాలి. రోజూ సమతులాహారం తీసుకోవడమే కాదు సమయానికి భోజనం చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ శిరోజాల పెరుగుదల మీద ప్రభావం చూపుతాయి. అంతేకాదు మారిన జీవనశైలి, ఒత్తిడి, ఆలస్యంగా పడుకోవడం లాంటి అలవాట్ల వల్ల శరీరంలోని వివిధ అంగాల ఆరోగ్యం దెబ్బతింటుంది. వాటితోపాటు శిరోజాల దృఢత్వం కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే శరీర భాగాలకు పోషకాహారం ఎంత అవసరమో జుట్టు పెరుగుదలకు కూడా పౌష్టికాహారం అంతే అవసరం.
మనం తీసుకునే పోషకాహారం బట్టి శిరోజాల పెరుగుదల ఉంటుందని పోషకాహార నిపుణులు సైతం చెప్తున్నారు. మనం తినే సమతులాహారం రకరకాల జబ్బుల బారిన పడకుండా మనల్ని కాపాడడమే కాదు శిరోజాల్ని, చర్మాన్ని కూడా సంరక్షిస్తుంది. అంతేకాదు ఇటీవల చిన్నా, పెద్దా అందరూ ఫాస్ట్‌ఫుడ్స్‌కు బాగా అలవాటుపడ్డారు. దీంతో పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఎన్నో విటమిన్లను, మినరల్స్‌ను, ఎంజైములను వాళ్లు కోల్పోతున్నారు. అలాగే బరువు తగ్గాలని కొందరు తిండి సరిగా తినడంలేదు. ఇవన్నీ శరీరారోగ్యం మీద తద్వారా శిరోజాలు, చర్మం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. అందుకే సమ పాళ్లల్లో పిండిపదార్థాలు, ప్రొటీన్లు, సప్లిమెంట్లు , ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. శిరోజాల పరిరక్షణలో ఐరన్‌ ప్రముఖపాత్ర వహిస్తుంది. ఆకుకూరల్లో ఇది బాగా ఉంటుంది కాబట్టి వీటిని బాగా తినాలి.
తేనె, బ్లాక్‌ చెన్నా, పాలకూరలలో కూడా ఐరన్‌ బాగా ఉంటుంది. జుట్టు పెరగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్‌-ఇ, విటమిన్‌-బి, విటమిన్‌-సిలు అత్యావశ్యకాలు. జీడిపప్పులు, బాదంపప్పుల్లో విటమిన్‌-ఇ పుష్కలంగా ఉంటుంది. మామిడిపండు, పుచ్చకాయల్లో విటమిన్‌-బి బాగా ఉంటుంది. శిరోజాల పెరుగుదలకు ఇవి అవసరం. ఒకవేళ జుట్టు బాగా ఊడిపోతున్న పక్షంలో అత్యాధునికమైన హెయిర్‌ రెజ్యువనేషన్‌ ట్రీట్‌మెంట్‌ కూడా చేయించుకోవచ్చు. జుట్టు చిట్లిపోవడం సమస్యతో కొందరు బాధపడుతుంటారు. వీళ్లు అరటిపండు పేస్టు, కలబంద జెల్‌, కొబ్బరినూనెలను వాడితే మంచిది. ఒక్కమాటలో చెప్పాలంటే నిత్యం సమతులాహారం తీసుకోవడం ద్వారా శిరోజాలకు సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సో....మంచి ఫుడ్‌ తినండి...శరీరారోగ్యంతోపాటు శిరోజాల ఆరోగ్యమూ కాపాడుకోండి..

hair fall tips in telugu language

lose weight tips in Telugu బరువు తగ్గాడానికి 10 చిట్కాలు


 బరువు తగ్గాడానికి 10 చిట్కాలు 

ఆరోగ్య సమస్యలన్నీ బరువు పెరగడం వల్లనే వస్తున్నాయనేది అందరికీ తెలిసిందే. డాక్టర్లు కూడా ఇదే విషయం చెబుతుంటారు. కానీ చాలా మంది బరువు తగ్గడంపై దృష్టి పెట్టరు. కొంత మంది ప్రయత్నించినా బరువు తగ్గరు. అలాంటి వారు ఈ జాగ్రత్తలు పాటించండి.

బరువు పెరగటానికి ప్రధాన కారణం లైఫ్‌స్టయిల్‌. జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరుగుతారు. కొంత మంది హార్మోన్ల ప్రభావం మూలంగా లావవుతారు. ఏ కారణం వల్ల బరువు పెరుగుతున్నారో ముందుగా తెలుసుకోవాలి. ఆహారపు అలవాట్ల వల్ల బరువు పెరుగుతున్నట్లయితే వెంటనే మెనూను మార్చుకోవాల్సి ఉంటుంది. బరువు పెరుగుతున్న వారు ముందుగా వారి రోజు వారి కార్యక్రమాలను ఒక పేపరుపై రాసుకోవాలి. తీసుకుంటున్న ఆహారం, చేస్తున్న పని తదితర వివరాలను పూర్తిగా అందులో పొందుపర్చాలి. అప్పుడు బరువు పెరగటానికి గల కారణం సులభంగా తెలుస్తుంది.

 బ్రేక్‌ఫా్‌స్టకు లంచ్‌కు మధ్య స్నాక్స్‌ లాంటివి తీసుకోకూడదు.
 రోజూ శారీరక శ్రమఉండేటట్లుగా చూసుకోవాలి.
కొంత మంది అన్నం తినడం మానేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల నీరస పడిపోవడం జరుగుతుంది. దానివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం బ్రేక్‌పాస్ట్‌, మధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్నర్‌ తప్పకుండా ఉండాలి.
 ఇక మెనూలో ఉండాల్సి ఆహార పదార్థాల విషయానికొస్తే తక్కువ శక్తినిచ్చే ఆహారం ఉండేలా చూసుకోవాలి.
 కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేలా, ప్రోటీన్‌లు అవసరమైనంత లభించేలా మెనూ ఉండాలి.
 పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. 100 గ్రా. పండ్లలో 60 కాలరీల శక్తి ఉంటే, 100 గ్రా. కూరగాయలలో 15 కాలరీల శక్తి ఉంటుంది.
 అన్నం తినేముందు కొన్ని పచ్చి కూరగాయ ముక్కలు తినాలి. దీని వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు.
 వెజిటబుల్‌ సలాడ్స్‌ ఎక్కువగా తీసుకోవాలి.
 పెరుగు స్థానంలో బటర్‌ మిల్క్‌ చేర్చాలి.
 నిలువ పచ్చళ్లు తీసుకోవడం మానేయాలి.
 పడుకునే ముందు తక్కువ ఆహారం తీసుకోవాలి. ఆహారంలో ఏదైనా ఫ్రూట్‌ చేర్చాలి.
 కొందరు బరువును తగ్గించుకోవడం కోసం ఆపరేషన్‌ చేయించుకుంటుంటారు. కానీ ఏది చేసినా డైట్‌ కంట్రోల్‌ మాత్రం తప్పనిసరి. లేకపోతే ఆపరేషన్‌ తరువాత కూడా మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆపరేషన్‌ వల్ల ఇతర సమస్యలు ఉత్పన్నం కావడానికి ఆస్కారం ఉంది.

  1. weight loss tips in telugu language
  2. weight loss tips in telugu pdf
  3. weight loss tips for men in telugu
  4. ayurveda tips for weight loss in telugu

Oily skin tips in Telugu జిడ్డు చర్మం చిట్కాలు


 

Oily skin tips in Telugu  జిడ్డు చర్మం చిట్కాలు

  • జిడ్డు చర్మం వాల్లకి మేకప్‌ వేసుకునే అలవాటు ఉంటే కనుక వాళ్లు జిడ్డుగా ఉండే కాస్మొటిక్స్‌ వాడకూడదు. అటువంటివి వాడడం వల్ల చర్మ రంధ్రాలలో కాస్మొటిక్స్‌ చిక్కుకుని బ్లాక్‌హెడ్స్‌గా మారతాయి. తరువాత అవే మొటిమలు అవుతాయి.
  •  జిడ్డు చర్మం గల వాళ్లు సున్నితమైన క్లెన్సర్‌ను ఉపయోగించాలి. సబ్బు కంటే కూడా క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుని నీళ్లతో కడిగేసుకుంటే ముఖం శుభ్రంగా ఉంటుంది. పదే పదే సబ్బును ఉపయోగించడం వల్ల చర్మకణాలు పాడవుతాయి.
  •  మృత చర్మ కణాలను తొలగించేందుకు ఎక్స్‌ఫోలియేషన్‌ చేయడం మంచిది. చర్మ రంధ్రాలలో వృద్ధి చెందే మృతకణాలను ఎక్స్‌ఫోలియేట్‌ చేయడం ద్వారా తొలగిస్తే బ్లాక్‌హెడ్స్‌ సమస్య చాలావరకు తీరిపోతుంది.
  •  బాగా జిడ్డుగా ఉంటే ఆ జిడ్డును తొలగించేందుకు క్లే మాస్క్‌ ఉపయోగించాలి. పుదీనా, పిప్పర్‌మెంట్‌ లేని క్లే మాస్క్‌ను వాడడం మంచిది.
  •  నిమ్మరసం, బాదం నూనె, గ్లిజరిన్‌లను సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించుకోవాలి. ఇది బ్లాక్‌హెడ్స్‌ తగ్గేందుకు ఉపకరించడమే కాక ముఖంపై ఉండే ఇతర మచ్చలను కూడా తగ్గిస్తుంది.
  •  ప్రతిరోజూ సాయంత్రం గోరువెచ్చటి నీళ్లలో ముంచిన బట్టతో ముఖాన్ని తుడుచుకోవడం ఎంతో మంచిది. గోరువెచ్చటి నీళ్లలో టవల్‌ లేదా నాప్‌కిన్‌ను ముంచి పావుగంట పాటు ముఖం మీద వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలలో చిక్కుకుపోయిన మురికి, మృతకణాల వంటివి బయటకు వచ్చేస్తాయి. అనంతరం నాప్‌కిన్‌ను వేడినీళ్లలో ఉతకడం మాత్రం మరిచిపోకండి.
  •  కొంచెం తేనె తీసుకుని దానిని వేడిచేసి బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ఉన్నప్రాంతంలో రాసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది సహజమైన పీల్‌లా ఉపయోగపడుతుంది. బ్లాక్‌హెడ్స్‌ తొలగించేందుకు బాగా దోహదం చేస్తుంది

Dental care in Telugu దంతాల సంరక్షణ



  దంతాల సంరక్షణ
తీపి పదార్థాలు తినడం వల్లే దంతాలు పాడవుతాయా? దంతాలకు స్కేలింగ్‌ మంచిది కాదా? లాంటి అపోహలు చాలామందిలో ఉన్నాయి.

 ఉదాహరణకు స్కేలింగ్‌ దంతాలకు మంచిది కాదని కొంతమంది అంటారు. కానీ అది తప్పు. స్కేలింగ్‌ దంతాల చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. దంతాలపైనుండే పసుపుపచ్చదనాన్ని పోగొడుతుంది. చిగుళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల, స్కేలింగ్‌ వల్ల నోటి దుర్వాసన ఉండదు. అలా్ట్రసోనిక్‌ స్కేలింగ్‌తో దంతాలను క్రమంతప్పకుండా శుభ్రం చేయించుకుంటుండాలి. అవసరానికి మించి స్కేలింగ్‌ చేయకూడదని మరవకండి. అలా చేస్తే దంతాలు దెబ్బతినే అవకాశం ఉంది. 

ఇంకొక పెద్ద అపోహ ఏమిటంటే వైటనింగ్‌ వల్ల దంతాలపై నుండే ఎనామిల్‌ దెబ్బతింటుందని చాలామంది నమ్ముతుంటారు. ఇది కూడా అపోహే. అత్యాధునిక పద్ధతైన జూమ్‌ వైటనింగ్‌ దంతాలపై ఉండే మరకలను పోగొడుతుంది. అంతేకాదు దంతాలు తమ సహజమైన తెలుపుదనంతో మెరిసేలా చేస్తుంది. ఇది చాలా సింపుల్‌ విధానం మాత్రమే కాదు ఎంతో సురక్షితమైన విధానం కూడా. ఎందుకంటే బ్లీచింగ్‌ ఏజెంట్స్‌, కెమికల్స్‌ ఇందులో ఉండవు. చక్కెర తినడం వల్లనే దంతక్షయం సంభవిస్తుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇది కూడా కేవలం ఒక అపోహే. ఎందుకంటే బాక్టీరియా వల్ల నోట్లో యాసిడ్లు ఉత్పత్తయి దంతక్షయం సంభవిస్తుంది. చక్కెర వల్లే కాదు పళ్లు, కూరగాయలు, అన్నం, బ్రెడ్‌ వంటి వాటిని తిన్నా కూడా దంతక్షయం సంభవిస్తుంది. దంత సంరక్షణను పాటు ఆమ్లాలున్న ఆహారాన్ని తక్కువ తీసుకుంటే దంతక్షయాన్ని నివారించవచ్చు.

How To Get Rid of Ants చీమల బారి నుండి తప్పించు కోవడం ఎలా ?

ఇంట్లో చీమలు రాకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే..
 వెనిగర్‌ : ఇంట్లో ఏ మూలల నుంచి చీమలు వస్తున్నాయో గమనించి ఆ ప్రదేశాల్లో వెనిగర్‌ని చల్లాలి. ముఖ్యంగా అవి వదిలిపెట్టిన ఫెరోమోన్స్‌ను నాశనం చేయాలి. ఎందుకంటే వీటి సహాయంతోనే తాము వచ్చిన స్పాట్స్‌ను చీమలు గుర్తిస్తాయి.
 చీమల బారి నుండి తప్పించు కోవడం ఎలా ?
మిరియాలు: బారులు కట్టిన చీమలపై మిరియాలపొడి చల్లగానే అవి చెల్లాచెదురైపోయి ఎక్కడి నుంచి వచ్చాయో ఆ ప్రదేశానికి పోతాయి. అలా మిరియాల పొడి సహాయంతో వాటి ఎంట్రీ పాయింట్స్‌ను కనిపెట్టొచ్చు.
 
పుదీన: చిన్న కుండల్లో పుదీన వేసి వాటిని గది తలుపులు, కిటికీల దగ్గర పెట్టాలి. సువాసనలను చీమలు పసిగడతాయి. పుదీన నుంచి మంచి వాసన వస్తుంది కదా. అందుకే ఇది ఇంట్లో చీమల ప్రదేశాలను కనిపెట్టడానికి మంచి సాధనంగా ఉపయోగపడుతుంది.
 
చాక్‌ లేదా టాల్కమ్‌ పౌడర్‌: చీమలు ఇంట్లోకి రాకుండా టాల్కమ్‌ పౌడర్‌ లేదా చాక్‌లు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. ఈ రెండూ కూడా చీమల వాసనశక్తిని దెబ్బతీస్తాయి. అందుకే చాక్‌ లేదా టాల్కమ్‌ పౌడర్‌తో గీసిన గీతలను దాటి అవి లోపలికి రాలేవు.
 
నిమ్మ లేదా దోసతొక్కు: చీమలు రాకుండా ఈ తొక్కలూ బాగా పనిచేస్తాయి. నిమ్మ తొక్కు లేదా దోసకాయతొక్కను చీమలు ఉండే ప్రదేశంలో పెడితే వాటి వాసనకు చీమలు కుదేలవుతాయి. మైల్డ్‌గా అయిపోతాయి. అంతేకాదు చీమలు తినే ఒకరకమైన ఫంగ్‌సను దోస లేదా నిమ్మ తొక్కలు తొలగింపజేస్తాయి.

eye care tips in telugu

శరీరంలో చురుకుదనం కోసం ఉదయాన్నే ఎక్సర్‌సైజ్‌లు చేస్తాం. అయితే కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం చాలా మంది ఆలోచించరు. విధుల్లో ఉన్నప్పుడు కంటి నుంచి నీరు కారటం లాంటివి జరుగుతుంటే ఐ ఎక్సర్‌సైజ్‌లు చేయాల్సిందే. అవెలాగో తెల్సుకుందాం.
  • ముక్కుకి పది సెంటీమీటర్ల దూరంలో చేయి బొటనవేలు ఉంచాలి. ఆ బొటనవేలుని చూస్తుండాలి. తర్వాత క్రమంగా బొటనవేలును పైకి తీసుకెళుతూ చూస్తుండాలి. చివరికి బొటనవేలును చూడలేని స్థితి వస్తుంది. అప్పుడు రెండు సెకన్ల పాటు స్ట్రయిట్‌గా చూడాలి.
  • తర్వాత మళ్లీ బొటనవేలును క్రమంగా ముక్కుదగ్గరకు తీసుకొస్తూ ఆ బొటనవేలును చూస్తుండాలి. యథాస్థితికి వచ్చాక కళ్లు కాసేపు మూసుకోవాలి.
  • బొటనవేలును తలకు అన్ని వైపులా వివిధ ఇమాజినరీ పాయింట్స్‌ వద్ద ఉంచుతూ కళ్లతో చూస్తుండాలి. ఇలా రోజుకు రెండు నుంచి నాలుగుసార్లు ఈ ఎక్సర్‌సైజ్‌ చేస్తే కళ్లకు మంచిది.
  • ఐ బాల్స్‌ ఎక్సర్‌సైజ్‌లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఎక్సర్‌సైజ్‌ చేసే ముందు మొదట కళ్లను రెండు చేతులతో మూసేయాలి. రెప్పలపై మరీ ఒత్తిడి చేయకూడదు. కనుగుడ్లను ఎడమ నుంచి కుడికి, పైనుంచి కిందకు, క్లాక్‌ వైజ్‌, యాంటీ క్లాక్‌వైజ్‌ తిప్పాలి. ఇలా పదిసార్లు ఐ బాల్స్‌ ఎక్సర్‌సైజ్‌ చేయాలి.
  • కొద్దిసేపు పేపర్లు, పుస్తకాలు చదవాలి. ఇలా చేస్తే చివరికి కళ్లు అలసిపోతాయి. ఆ తర్వాత మంచి ఫలితం కళ్లముందే కనిపిస్తుంది.