2, ఆగస్టు 2015, ఆదివారం

anti hair fall tips in Telugu జుట్టు రాలకుండా వుండాలంటే ?


anti hair fall tips in Telugu  జుట్టు రాలకుండా వుండాలంటే ?

జుట్టు అధికంగా రాలితే మానసికంగా కృంగిపోతుంటారు. అలా కృంగిపోవటం వల్ల కూడా జుట్టు ఇంకా రాలే శాతం అధికమవుతుందని మర్చిపోరాదు. జుట్టు అధికంగా రాలే వారు తేలికపాటి టిప్స్‌తో పాటు కొన్ని హోమ్‌ రెమిడీస్ను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు. ఆ టిప్స్‌ తెల్సుకుందాం.
అధికంగా జుట్టు రాలిపోతుంటే మొదట ఓ రెండు విషయాలు పాటించాలి. ఒకటి పొడి జుట్టును పలుమార్లు దువ్వడం చేయకండి. దీని వల్ల జుట్టు రాలిపోయే అవకాశాలెక్కువ. ఇక రెండోది రోజూ ఉదయాన్నే తల మాడుని మసాజ్‌ చేయించుకోవాలి. దీని వల్ల పుర్రెమీద చర్మం ఉత్తేజితమవుతుంది. తద్వారా జుట్టు మూలాలు ఆరంభమయ్యే చోట ఉండే చిన్నపాటి రంధ్రాలు చురుకై ఆశించిన మంచి ఫలితం కలుగుతుంది.
ఆలివ్‌ లేదా కొబ్బరి నూనెను తీసుకుని దానిలోకి రెండు చుక్కల నిమ్మరసం వేయాలి. దీన్ని మిక్స్‌ చేసి తలకి అప్లై చేయాలి. ఒక గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో తలని శుభ్రపరుచుకోవాలి.
ఒక పాత్రలో నీటిని కాచి దాంట్లో కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె వేయాలి. ఒక టవల్‌ని ఆ నీటిలో ముంచి తలని కవర్‌ చేసేట్లు చుట్టేయాలి. ఇది న్యాచురల్‌ స్పా అనుకోవచ్చు.
వెల్లుల్లి, అల్లం లేదా ఉల్లి రసాన్ని రాత్రి పడుకునేముందు తలకి బాగా పట్టించుకోవాలి. ఉదయం నిద్ర లేస్తూనే జుట్టును శుభ్రం చేసుకోవాలి. చక్కని ఫలితం కలుగుతుంది.

జుట్టు ఊడిపోతుంటే చాలామంది తెగ ఆందోళన పడిపోతుంటారు. కానీ మనం తినే ఆహారం బట్టి కూడా శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయన్న విషయం ఎంతమందికి తెలుసు? అనారోగ్యపు ఆహారపు అలవాట్ల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. పలచబడుతుంది. వెంట్రుకలు పొడిబారిపోతాయి. అంతేకాదు తెల్లబడతాయి కూడా. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా ఆ ప్రభావం శిరోజాల పెరుగుదల మీద, చర్మ ఆరోగ్యం మీద పడుతుంది. కాలుష్యం, పర్యావరణంలో మార్పులు సైతం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే నిత్యం పోషకాహారాన్ని తీసుకోవాలి. రోజూ సమతులాహారం తీసుకోవడమే కాదు సమయానికి భోజనం చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ శిరోజాల పెరుగుదల మీద ప్రభావం చూపుతాయి. అంతేకాదు మారిన జీవనశైలి, ఒత్తిడి, ఆలస్యంగా పడుకోవడం లాంటి అలవాట్ల వల్ల శరీరంలోని వివిధ అంగాల ఆరోగ్యం దెబ్బతింటుంది. వాటితోపాటు శిరోజాల దృఢత్వం కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే శరీర భాగాలకు పోషకాహారం ఎంత అవసరమో జుట్టు పెరుగుదలకు కూడా పౌష్టికాహారం అంతే అవసరం.
మనం తీసుకునే పోషకాహారం బట్టి శిరోజాల పెరుగుదల ఉంటుందని పోషకాహార నిపుణులు సైతం చెప్తున్నారు. మనం తినే సమతులాహారం రకరకాల జబ్బుల బారిన పడకుండా మనల్ని కాపాడడమే కాదు శిరోజాల్ని, చర్మాన్ని కూడా సంరక్షిస్తుంది. అంతేకాదు ఇటీవల చిన్నా, పెద్దా అందరూ ఫాస్ట్‌ఫుడ్స్‌కు బాగా అలవాటుపడ్డారు. దీంతో పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఎన్నో విటమిన్లను, మినరల్స్‌ను, ఎంజైములను వాళ్లు కోల్పోతున్నారు. అలాగే బరువు తగ్గాలని కొందరు తిండి సరిగా తినడంలేదు. ఇవన్నీ శరీరారోగ్యం మీద తద్వారా శిరోజాలు, చర్మం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. అందుకే సమ పాళ్లల్లో పిండిపదార్థాలు, ప్రొటీన్లు, సప్లిమెంట్లు , ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. శిరోజాల పరిరక్షణలో ఐరన్‌ ప్రముఖపాత్ర వహిస్తుంది. ఆకుకూరల్లో ఇది బాగా ఉంటుంది కాబట్టి వీటిని బాగా తినాలి.
తేనె, బ్లాక్‌ చెన్నా, పాలకూరలలో కూడా ఐరన్‌ బాగా ఉంటుంది. జుట్టు పెరగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్‌-ఇ, విటమిన్‌-బి, విటమిన్‌-సిలు అత్యావశ్యకాలు. జీడిపప్పులు, బాదంపప్పుల్లో విటమిన్‌-ఇ పుష్కలంగా ఉంటుంది. మామిడిపండు, పుచ్చకాయల్లో విటమిన్‌-బి బాగా ఉంటుంది. శిరోజాల పెరుగుదలకు ఇవి అవసరం. ఒకవేళ జుట్టు బాగా ఊడిపోతున్న పక్షంలో అత్యాధునికమైన హెయిర్‌ రెజ్యువనేషన్‌ ట్రీట్‌మెంట్‌ కూడా చేయించుకోవచ్చు. జుట్టు చిట్లిపోవడం సమస్యతో కొందరు బాధపడుతుంటారు. వీళ్లు అరటిపండు పేస్టు, కలబంద జెల్‌, కొబ్బరినూనెలను వాడితే మంచిది. ఒక్కమాటలో చెప్పాలంటే నిత్యం సమతులాహారం తీసుకోవడం ద్వారా శిరోజాలకు సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సో....మంచి ఫుడ్‌ తినండి...శరీరారోగ్యంతోపాటు శిరోజాల ఆరోగ్యమూ కాపాడుకోండి..

hair fall tips in telugu language

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి