ర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలంటే వంటింట్లో దొరికే వస్తువులతో ఆరోగ్యవంతమైన ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. అలాంటి మూడు రకాల ఫేస్ ప్యాక్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం...
వేప, శెనగపిండి, పెరుగుతో ప్యాక్...
వేప, శెనగపిండి, పెరుగుతో ప్యాక్...
కావాల్సినవస్తువులు: వేపాకులు లేదా వేప పొడి, ఒక టేబుల్‌స్పూన్ శెనగపిండి, ఒక టీస్పూన్ పెరుగు.
ఫేస్ ప్యాక్ తయారీ: ఒక టీస్పూను పెరుగును చిన్న గిన్నెలో పోయాలి. అందులో శెనగపిండి కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. తర్వాత బాగా నూరిన వేపాకులు లేదా వేప పొడిని ఆ పేస్టులో కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10-15 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇందులో పెరుగు వాడడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. ఈ ప్యాక్‌లో వేపపొడి లేదా వేపాకులను ఉపయోగించడం వల్ల ముఖానికి యాంటిసెప్టిక్‌లా పనిచేస్తుంది.
బాదం, తేనె, కుంకుమపువ్వు ప్యాక్..
కావాల్సిన వస్తువులు: నాలుగు లేదా ఐదు బాదం పప్పులు(ముందురోజు రాత్రే నీళ్లల్లో గాని లేదా పాలల్లో గాని బాదం పప్పులను నానబెట్టాలి), ఒక టీస్పూన్ తేనె, కుంకుమపువ్వు (రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చటి పాలల్లో కుంకుమపువ్వును నానబెట్టాలి), ఒక టీస్పూన్ నిమ్మరసం.
ఫేస్ ప్యాక్ తయారీ: నానిన బాదంపప్పులను పేస్టులా చేయాలి. ఆ పేస్టులో నానబెట్టిన కుంకుమపువ్వును కలపాలి. దీంతోపాటు తేనె, నిమ్మరసాల్ని కూడా కలిపి చిక్కని పేస్టులా తయారుచేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుని 10-15 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ముఖానికి రాసుకున్న పేస్టు ఎండిపోయిన తర్వాత పాలల్లో లేదా నీళ్లల్లో ముంచిన కాటన్ ప్యాడ్స్‌తో ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ ప్యాక్ రాసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మెరుపువస్తుంది. ఇందులో వాడిన కుంకుమపువ్వు స్కిన్‌టోన్‌ని మెరుగుపరుస్తుంది. చర్మం మీద మచ్చలను పోగొడుతుంది. తేనె వల్ల చర్మం సాగకుండా మంచి పటుత్వంతో ఉంటుంది. బాదం, నిమ్మ రెండూ చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తాయి.
అరటిపండు, పెరుగు ప్యాక్...
కావాల్సిన వస్తువులు: బాగా మగ్గిన అరటిపండు ఒకటి, పెరుగు ఒక టేబుల్‌స్పూను, తేనె ఒక టీస్పూను, నిమ్మరసం ఒక టీస్పూన్
ఫేస్‌ప్యాక్ తయారీ: చిన్న గిన్నె తీసుకుని అందులో అరిటిపండు గుజ్జును, పెరుగును వేసి బాగా కలపాలి. దానికి తేనె, నిమ్మరసం కూడా చేర్చి చిక్కటి పేస్టులా తయారుచేయాలి. ఈ ప్యాక్‌ను ముఖం మీద, మెడభాగంలో రాసుకోవాలి. ప్యాక్ ఎండిపోయే వరకూ ఉంచుకుని చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. నిమ్మ సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్. దీనివల్ల చర్మం శుభ్రంగా ఉండడంతోపాటు కాంతివంతంగా ఉంటుంది. అరటి పండు గుజ్జును రాసుకోవడం వల్ల కూడా చర్మం మెరుస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి